: జమ్మూ కాశ్మీర్ లో వీకే సింగ్ పర్యటన


కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు వద్ద కాల్పులు ఆగినప్పుడే పాకిస్థాన్ తో చర్చలు జరుపుతామన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘన కొనసాగినంత కాలం పాక్ తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లడఖ్ లో చైనీస్ ఆర్మీతో నెలకొన్న ప్రతిష్ఠంభనపై మాట్లాడుతూ, చర్చల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా ప్రధాని జి జిన్ పింగ్ భారత్ లో పర్యటించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారన్నారు.

  • Loading...

More Telugu News