: 'లవ్ జిహాద్' కేవలం మీడియా హైపే!: జాతీయ మహిళా కమిషన్
'లవ్ జిహాద్' విషయం కేవలం మీడియా హైప్ చేసిందేనని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యు) చీఫ్ లలిత కుమారమంగళం కొట్టిపారేశారు. అది మీడియా ద్వారానే సంచలనమైందని అన్నారు. ఈ మేరకు తన స్పందన తెలియజేసిన ఎన్సీడబ్ల్యు చీఫ్, "మహిళలు పోరాడే సమస్యలతో పోల్చితే మొత్తంగా ఇది అప్రాధాన్య అంశం. వీటి గురించి మీడియా రాయడం మానేస్తే ప్రజలు కూడా మాట్లాడుకోవడం మానేస్తారు" అని స్పష్టం చేశారు. కాగా, త్వరలో ఎన్సీడబ్ల్యు ప్రాంగణంలోనే కేసులు నమోదు చేసే సౌకర్యాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రితో మాట్లాడానని ఆమె చెప్పారు.