: ఎన్డీఏ పాలనలో ఆర్థిక వ్యవస్ధ మెరుగవుతోంది, ధరలు తగ్గుతున్నాయి: బీజేపీ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం బలపడుతోందని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. అటు వార్షిక టోకు ద్రవ్యోల్బణం రేటు (అక్టోబరులో 1.77%) కూడా ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిందని తెలిపింది. "ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో ద్రవ్యోల్బణం ఐదేళ్ళ దిగువకు చేరింది. వృద్ధిరేటు పెరుగుతుండగా, అంతర్జాతీయ వాణిజ్య అంశాల్లో దేశం కొత్త విజయం సాధిస్తోంది. ఇందులో పేద, సాధారణ వ్యక్తిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వాటిలో ప్రధానమైన ధర పెరుగుదల. ఈ విషయంపై ప్రభుత్వం బాగా దృష్టి పెట్టింది" అని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఓ ప్రకటనలో వివరించారు. కాగా, ఆహార ఉత్పత్తుల, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడంతోనే ద్రవ్యోల్బణం రేటు కిందికి దిగి వచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News