: శ్రీలంకకు రానున్న పోప్


పోప్ ఫ్రాన్సిస్ దక్షిణాసియా పర్యటన షెడ్యూల్ ను వాటికన్ అధికారులు విడుదల చేశారు. జనవరి 12న రోమ్ నుంచి బయలుదేరి పోప్ ఫ్రాన్సిస్ 13న శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకుంటారు. మూడు రోజుల పర్యటన అనంతరం 15న మనీలాకు వెళ్లి అక్కడి నుంచి 19న తిరిగి రోమ్ కు వెళతారు. శ్రీలంక అధికారుల సమాచారం ప్రకారం కొలంబోలోని ఆర్చ్ డియోసిస్ చర్చిలో బిషప్ లను ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అధ్యక్షుడు మహింద రాజపక్సను కలవనున్నారు. మరికొన్ని కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News