: ఆ ప్రచారంలో వాస్తవం లేదు!: మంత్రి అయ్యన్నపాత్రుడు


ఐఏఎస్ అధికారిని దుర్భాషలాడారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, ఏ ఐఏఎస్ అధికారినీ తాను దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా తాను చాలామంది అధికారులతో పని చేశానని ఆయన తెలిపారు. అధికారులంటే చాలా గౌరవం ఉందని ఆయన చెప్పారు. మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News