: తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పీకర్ సి.మధుసూదనాచారి సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రాష్ట్రంలోని అంశాలపై పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బొడిగే శోభ కోరారు. ముఖ్యంగా మోతె ప్రాజెక్టు వల్ల 2700 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, అయినా ఆ ప్రాజెక్టు పూర్తయితే 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆమె అన్నారు. దానికి మంత్రి హరీశ్ రావు సమాధానమిస్తూ, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.