: సచిన్ కు మాటిస్తున్నాం... మేము పొగతాగం, మద్యపానం చేయం


పుట్టంరాజు కండ్రిగ గ్రామ ప్రజలు సచిన్ కు వెలకట్టలేని అనుభూతి మిగిల్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్న పీఆర్ కండ్రిగ గ్రామ ప్రజలు సచిన్ కు ప్రమాణం చేయనున్నారు. తమ గ్రామంలో పొగతాగమని, మద్యపానం చేయమని మాటివ్వనున్నారు. యాదవులు అత్యధికంగా గల పీఆర్ కండ్రిగలో గొర్రెల పెంపకం గురించి సచిన్ తెలుసుకోనున్నారు. అలాగే ఆయన దళితులతో చర్చించనున్నారు. పిల్లలతో కలసి క్రికెట్ ఆడేందుకు కూడా సచిన్ సన్నద్ధమవుతున్నారు. మొత్తానికి సచిన్ పీఆర్ కండ్రిగకు తీపి గురుతులు అందించనున్నారు.

  • Loading...

More Telugu News