: నల్లధనాన్ని దేశానికి రప్పిస్తాం: మోదీ


నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మోదీ మాట్లాడుతూ, నల్లధనం దేశ భద్రతకు పెను సవాల్ గా పరిణమించిందని అన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఆయన వెల్లడించారు. నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడానికి ప్రపంచ దేశాల సహకారం, సమన్వయం అవసరమని మోదీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News