: హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం
మూడు రోజుల సింగపూర్ పర్యటన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాదు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సింగపూర్ పర్యటన విజయవంతమైనదని అన్నారు. సింగపూర్ లో 300 మంది పారిశ్రామిక వేత్తలు తమ బృందంతో మాట్లాడారని ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. వారిలో చాలా మంది జనవరి నాటికి ఏపీతో ఒప్పందాలు చేసుకుంటారని ఆయన వివరించారు. ఈ నెల 23 నుంచి 29 వరకు బాబు జపాన్ లో పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను 2022 నాటికి దేశంలోని మూడు ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా బాబు తీర్చిదిద్దుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2029 నాటికి ఏపీ ప్రపంచంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.