: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారంతా కలిసే ఉండాలి: సుజనా చౌదరి


భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా కలిసే ఉండాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆకాంక్షించారు. హైదరాబాదులో ఆయనను కలసిన తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలకు చెందిన ఏ సమస్యనైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నేతల సిఫారసుల పరిష్కారానికి ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తానని సుజనా పేర్కొన్నారు. విభేదాలను విడనాడి దేశాభివృద్ధిలో అంతా కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News