: కేజ్రీవాల్ ఢిల్లీ నుంచే పోటీ చేస్తారు: ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచే పోటి చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆప్ విడుదల చేసిన జాబితాలో కేజ్రీవాల్ పేరు లేదన్న వార్తలపై ఢిల్లీలో ఆప్ నేత అశుతోష్ మాట్లాడుతూ, కేజ్రీవాల్ నియోజకవర్గం మార్చుకుంటారని వస్తున్న వార్తలు వాస్తవాలు కాదని అన్నారు. కేజ్రీవాల్ నియోజకవర్గం మార్చుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగుతారని ఆయన వివరించారు. కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఆప్ ఎన్నికల బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు.