: భారత్ తో బంధమే ముఖ్యం... యూకే స్ఫూర్తివంతమైన దేశం: బ్రిటన్, భారత్ ప్రధానుల అభిభాషణ


భారత ప్రధాని నరేంద్ర మోదీతో యూకే (యునైటెడ్ కింగ్ డమ్) ప్రధాని డేవిడ్ కేమెరూన్ సమావేశమయ్యారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధానులిద్దరూ బ్రిస్బేన్ లో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా వీరిద్దరూ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. సమావేశానంతరం కేమెరూన్ మాట్లాడుతూ, భారత్ తో సత్సంబంధాలకు యూకే అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. మోదీ మాట్లాడుతూ, యూకే విజన్ ఎంతో స్ఫూర్తివంతమైనదని, భారత్ ఆ దేశంతో భాగస్వామ్యం కోరుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News