: పాస్ పోర్టుల జారీలో భారత్ ది మూడో స్థానం: సుష్మా స్వరాజ్
ప్రపంచంలో అత్యధికంగా పాస్ పోర్టులు జారీ చేసే దేశాల్లో భారత్ మూడో స్థానం దక్కించుకుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మేఘాలయాలోని షిల్లాంగ్ లో పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ, పాస్ పోర్టుల జారీలో చైనా, అమెరికా తరువాతి స్థానం భారత్ దేనని అన్నారు. ఇప్పటికి మనదేశంలో 5.7 కోట్ల మంది పాస్ పోర్టు వినియోగదారులు ఉన్నారని ఆమె పేర్కొన్నారు.