: ఆస్ట్రేలియన్ యూనివర్శిటీలోని భారత్ మ్యాప్ లో కాశ్మీర్ మిస్సింగ్!
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ డిస్ ప్లేలో పెట్టిన భారత మ్యాప్ లో కాశ్మీర్ మిస్ అయింది. అసంబద్ధంగా ఉన్న ఆ భారత మ్యాప్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదరు విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తున్న సందర్భంగా గుర్తించారు. ఆ వెంటనే మోదీ వెంట ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ కూడా చెప్పారు. అటు ఈ విషయం కాస్తా ట్విట్టర్ లో చిన్నపాటి కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తరపున సమాజ్ వాదీ పార్టీ నిర్వహిస్తున్న ట్విట్టర్ లో కాశ్మీర్ మిస్సింగ్ పై వెంటనే ప్రశ్నించింది.