: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రూ. 3,100 కోట్లు
సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 3,100 కోట్ల రూపాయలకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. ఈ మూడు నెలల కాలంలో వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం సైతం 8 శాతం పెరిగి 13,274 కోట్ల రూపాయలకు చేరిందని బ్యాంకు శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.