: ఐసీసీ క్రికెటర్, టెస్ట్ క్రికెటర్ ఆప్ ద ఇయర్ గా ఆస్ట్రేలియన్ పేసర్
ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ జాన్సన్ రెండు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పురస్కారాలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా దక్షిణాఫ్రికా స్కిప్పర్ ఎ.బి.డి విలియర్స్, ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఇంగ్లండ్ ఆటగాడు గ్యారీ బాలెన్స్ లు ఎంపికయ్యారు. ఇక ఇంగ్లండ్ పై 63 బంతుల్లో 156 రన్స్ సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ టీ 20 అంతర్జాతీయ పెర్ఫార్మన్స్ అఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.