: సిగరెట్‌ను దూరం చేసేలా మెదడుపై అయస్కాంత ప్రభావం
సిగరెట్ తాగుతోంటే.. మహా ఉత్సాహంగా ఉంటుందని ధూమపాన ప్రియులు అంటూ ఉంటారు. ధూమపాన ప్రియత్వాన్ని అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో 90 శాతం విఫలమవుతున్నాయి కూడా. ఇందుకోసం మందులు, ప్రవర్తనా చికిత్సలు, హిప్నాసిస్, ఆక్యుపంక్చర్ వంటి అనేక పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇవన్నీ కూడా మెదడు పనితీరును మరో తీరుగా మార్చడం కోసమే.
అయితే బయోలాజికల్ సెకియాట్రీ అనే మేగజైన్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే.. హైఫ్రీక్వెన్సీ గల ట్రాన్స్‌క్రానియల్ అయస్కాంత ఉద్దీపనం ద్వారా సిగరెట్ అలవాటు ను తగ్గించవచ్చంటున్నారు. ఈ అయస్కాంత ఉద్దీపనాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పై ప్రయోగించాలి. అయితే శాస్త్రవేత్తలు సూచిస్తున్న ఈ పద్ధతిలో అయస్కాంత క్షేత్రాల ద్వారా నాడీకణాలను ఉద్దీపనం చేస్తారు. దీనికి అనస్తీషియా అవసరమూ ఉండదు. నుదురుమీద ఉంచే అయస్కాంత కాయిల్స్ ద్వారా చికిత్స జరుగుతుంది. దక్షిణ కెరోలీనాలోని వైద్య విశ్వవిద్యాలయంలో డాక్టర్ జింగ్‌బావో మరియు సహచరులు ఈ పరిశోధనను పరిశీలించి చూశారు.