: జేసీ, వీహెచ్ మధ్య ఆసక్తికర చర్చ


తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 'తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చినా కేసీఆర్ కి అధికారం అప్పగించారు' అని జేసీ ఆన్నారు. దీనికి వీహెచ్ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయామన్నారు. తెలంగాణ ఇచ్చి ఇక్కడ, పచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయిందని జేసీ అన్నారు. గీతారెడ్డి ఉన్నత పదవులు అలంకరిస్తారనుకున్నానని జేసీ పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయని, రానున్న రెండేళ్లలో సమైక్య ఉద్యమం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. ఉద్యమం తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని జేసీ ముక్తాయించారు.

  • Loading...

More Telugu News