: సింగపూర్ అభివృద్ధి సామాన్యుడి జీవితాన్నే మార్చేసింది: చంద్రబాబు
సింగపూర్ అభివృద్ధి సాధారణ వ్యక్తి జీవితాన్నే మార్చి వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు దక్షిణాసియా వార్షిక కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, సమావేశంలో కీలకోపన్యాసం చేసారు. భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతోందంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావే కారణమని చెప్పారు. 25 ఏళ్ల కిందటే భారత్ లో ఆయన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారని, దాంతో దేశం ప్రగతి బాట పట్టిందనీ అన్నారు. మళ్లీ ఇన్నాళ్ళకు భారత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో స్థిరమైన కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ క్రమంలో దేశం మళ్లీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా, నేటితో బాబు సింగపూర్ పర్యటన ముగియనుంది.