: ఐపీఎల్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రా, బిన్నీలపై విచారణ... శ్రీనివాసన్, ఓవైస్ షా లపై కూడా!


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో బట్టబయలైన కుంభకోణంలో విచారణను ఎదుర్కొన్న వారి పేర్లను సుప్రీంకోర్టు శుక్రవారం బట్టబయలు చేసింది. జస్టిస్ ముఖుల్ ముద్గల్ ఆధ్వర్యంలోని విచారణ కమిటీ సీల్డ్ కవర్ లో అందించిన సమాచారాన్ని కోర్టు వెల్లడించింది. రాజస్తాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్, ఇంగ్లాండ్ క్రికెటర్ ఓవైస్ షా, ఐపీఎల్ సిఈఓ సుందర్ రామన్, ఆటగాడు స్టువర్ట్ బిన్నీల పేర్లను నిందితులుగా ప్రకటించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు సుప్రీం వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News