: ల్యాండ్ పూలింగ్ కు చట్టబద్ధత కల్పిస్తాం: మంత్రి దేవినేని


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సేకరించనున్న భూమి విషయంలో అనుసరించనున్న ల్యాండ్ పూలింగ్ విధానానికి చట్టబద్ధత కల్పిస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ తో రైతులకు ఎలాంటి నష్టం రాదని, మరింత లాభదాయకమని ఆయన శుక్రవారం చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ను ఆధారం చేసుకుని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఉమ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News