: అబాట్ తో కలసి వరల్డ్ కప్ ఎత్తనున్న మోదీ
ఆస్ట్రేలియాలోని పురాతన క్రికెట్ స్టేడియంలలో ఒకటైన మెల్బోర్న్ స్టేడియాన్ని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ తో కలసి మోదీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ లో విజేతకు అందించే ట్రోఫీని ఇరు నేతలు కలసి ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. మోదీ పర్యటనలో చివరి రోజున ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే మోదీ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఎంసీజీ క్రికెట్ స్టేడియం సందర్శనపై సందిగ్ధత నెలకొంది. ఎంసీజీ స్టేడియం అధికారులు మాత్రం 700 మంది ప్రతినిధులకు సరిపడా విందు ఏర్పాట్లు చేస్తున్నారు.