: బాక్సర్ సరితా దేవికి విజేందర్ మద్దతు
గడచిన ఆసియా క్రీడల్లో పతకం తీసుకోవడానికి నిరాకరించి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆగ్రహానికి గురైన బాక్సర్ సరితా దేవికి మరో బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతు పలికాడు. సరితకు కఠిన శిక్ష విధించాలని బాక్సింగ్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని ఆయన కోరాడు. ఆమెపై జీవితకాల నిషేధాన్ని విధించవద్దని కోరాడు. "ఆ సమయంలో సరిత అలా ఎందుకు చేసిందో అర్థం చేసుకోవాలి. ఓటమి నిరుత్సాహంలో ఆపుకోలేని బాధతో పతకాన్ని నిరాకరించి ఉంటుంది. మాలాంటి ఆటగాళ్ళు ఎంతో కాలం శ్రమించి పోటీలకు వెళ్తుంటాం. అక్కడ అన్యాయం జరిగితే ఆపుకోలేని భావోద్వేగాలు కలగడం సహజం. నా మద్దతు సరితకే" అన్నాడు.