: ఫుట్ బాల్ దిగ్గజం పీలేకు ఆపరేషన్ విజయవంతం
ఫుట్ బాల్ దిగ్గజం పీలేకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కారణంగా పీలే బుధవారం రియో డీ జనిరోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు సర్జరీ నిర్వహించినట్టూ, ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కిడ్నీల్లో రాళ్లను తొలగించిన అనంతరం పీలే ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, 2012లో ఎముకకు సంబంధించిన ఆపరేషన్ ను చేయించుకున్నారు.