: సొంతంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించుకోబోతున్న తెలంగాణ రాష్ట్రం


ఇంటర్మీడియట్ పరీక్షలు సొంతంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్ ను తయారు చేయాలని ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. దాంతో, బోర్డు ప్రత్యేక షెడ్యూల్ ను తయారు చేయనుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సమావేశమై పరీక్షల నిర్వహణపై చర్చించారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించుకుందామని ఏపీ కోరగా, అందుకు తెలంగాణ మంత్రి నిరాకరించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంతో ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించే ప్రసక్తే లేదని, తమ షెడ్యూల్ ను తామే రూపొందించుకుంటామని తాజాగా టి.ప్రభుత్వం ఓ లేఖ రాసింది.

  • Loading...

More Telugu News