: కాశ్మీర్ లో కాల్పులు... ఇద్దరు హిజ్బుల్ మిలిటెంట్ల హతం
జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వీరిని హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. రాష్ట్రంలోని కుల్గాంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 16 గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఓ ఇంటిలో నక్కిన హిజ్బుల్ తీవ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వీరిని పసిగట్టిన తీవ్రవాదులు తప్పించుకునే క్రమంలో కాల్పులు మొదలుపెట్టారు. దీంతో ఎదురుకాల్పులకు భద్రతా బలగాలు దిగాయి. చివరకు భద్రతా దళాల కాల్పుల్లో తీవ్రవాదులు హతమయ్యారు.