: ఆస్ట్రేలియా చేరుకున్న మోదీ... బ్రిస్ బేన్ లో ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా చేరుకున్నారు. పదిరోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ, నిన్నటిదాకా మయన్మార్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జీ-20 సదస్సులో పాల్లొనే నిమిత్తం ఆయన ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరం చేరుకున్నారు. ప్రధానికి ఘన స్వాగతం లభించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియా గడ్డపై కాలుమోపినట్లైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మోదీ, జీ-20 సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతోనూ సమావేశం కానున్నారు. సిడ్నీలో ఏర్పాటు చేసే బహిరంగసభలో ఆయన మాట్లాడనున్నారు. ఇలా ఆస్ట్రేలియాలో ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడిన తొలి ఇతర దేశ ప్రధానిగా మోదీ రికార్డు నమోదు చేయనున్నారు.