: నేడు తెలంగాణ వ్యాప్తంగా టీటీడీపీ రాస్తారోకోలు, ధర్నాలు
తెలంగాణ శాసనసభలో పది మంది టీటీడీపీ శాసనసభ్యులను వారం పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీపీ భగ్గుమంది. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, నేడు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. నిరసన కార్యక్రమాల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని టీటీడీపీ నేతలు తెలిపారు.