: సత్య నాదెళ్ల మరో ఘనత... ఫార్చ్యూన్ సీఈఓల జాబితాలో చోటు!


మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. ఫార్చ్యూన్ మేగజైన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ సీఈఓల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ఆయనతో పాటు భారత్ కు చెందిన మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, హర్మన్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ దినేష్ పాలివాల్ లకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది. 50 మంది కార్పొరేట్ దిగ్గజాలతో ఫార్చ్యూన్ మేగజైన్ ‘బిజినెస్ పర్సన్ ఆప్ ది ఇయర్’ పేరిట రూపొందిన ఈ జాబితాలో గూగుల్ సీఈఓ లారీ పేజ్ అగ్రస్థానంలో నిలవగా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక భారత సంతతి ప్రముఖుల్లో బంగా 28వ స్థానంలో ఉండగా, సత్య నాదెళ్లకు 38వ స్థానం దక్కింది. పాలివాల్ కు 42వ స్థానం దక్కింది.

  • Loading...

More Telugu News