: ఆ పిల్లల్ని నెల రోజుల్లోగా వెతికి పట్టుకోండి!: సుప్రీం ఆదేశం
బీహార్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఆచూకీ లేకుండా పోయిన బాలల్ని వెతికి పట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఇలాంటి బాలల్ని వెతికి పట్టుకోవడంలో విఫలమైనందుకు తదుపరి విచారణ తేదీన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. తాము ఆదేశాలిచ్చిన వారం రోజుల్లో 169 మంది బాలల్ని వెతికిపట్టుకున్నందుకు బీహార్ ప్రభుత్వాన్ని అభినందించింది. మిగిలిన 464 మంది బాలల్ని వెతికిపట్టుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఆచూకీ లేకుండా పోయిన పిల్లల్ని వెతికి పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించరాదని, ఆచూకీ లేకుండా పోయిన వారిని వెతకడంలో తాము సూచించిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో నివేదికలు ఇవ్వాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.