: మీరు మందుబాబులా... అయితే వ్యాయామం చేయండి!
స్థూలకాయం తగ్గడానికి వ్యాయామం చేయడం అవసరం సంగతి తర్వాత గానీ.. మద్యం సేవించడం వల్ల బుద్ధి/మెదడు సరిగ్గా పనిచేయకుండా ఇతరులతో తగాదాలను కొని తెచ్చుకుంటూ ఉండే మిత్రులు మాత్రం.. తక్షణం వ్యాయామాన్ని ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే.. మద్యం సేవించడం అనేది మెదడు పనిచేయకుండా చూపించగల దుష్ప్రభావాన్ని... వ్యాయామం అడ్డుకుంటుందిట. మద్యం తాగితే మెదడు తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. వ్యాయామం ఆ ప్రబావాన్ని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన హోలిస్ కరోలీ బృందం వ్యాయామ ప్రభావాలపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. మామూలుగా మద్యం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. అయితే వ్యాయామం.. మెదడులోని తెల్ల భాగానికి రక్షణ కల్పిస్తూ చురుగ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు.