: ఈడెన్ రారాజుగా రోహిత్...టీమిండియా 262/3


ఈడెన్ గార్డెన్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రపుటలకెక్కాడు. 137 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సులతో 166 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్ ఈడెన్ గార్డెన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. ఓపెనర్ రహానే (28)కు జతగా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ సహచరులు వెనుదిరుగుతున్నా మొక్కవోని దీక్షతో, సాధికారికమైన ఆటతీరుతో క్రీజులో పాతుకుపోయాడు. రహానే ఎల్బీడబ్ల్యూ కాగానే, రాయుడు (8) వచ్చీరాగానే వెనుదిరిగాడు. తరువాత రోహిత్ తోపాటు నిలదొక్కుకున్న, కెప్టెన్ కోహ్లీ 66 పరుగుల వద్ద ఔటవడంతో, బరిలో దిగిన రైనా (11) వెంటనే వెనుదిరగడంతో, రోహిత్ కు ఊతప్ప జతకలిశాడు. 59 పరుగులకే తొలి రెండు వికెట్లు కూలిపోయి కష్టాల్లో పడుతుందనుకున్న టీమిండియాను రొహిత్, కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో నిలబెట్టారు. దీంతో 41 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News