: మేమెప్పుడూ హద్దులు మీరి మాట్లాడలేదు: ఈటెల
వ్యక్తులను లక్ష్యం చేసుకుని కొంత మంది శాసనసభ్యులు కించపరిచేలా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, సభ బయట కొంత మంది సభ్యులు మాట్లాడుతున్న భాష అసభ్యంగా ఉందని అన్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయకుండా, వ్యక్తులను లక్ష్యం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులను కించపరిచేలా మాట్లాడుతున్నారని పేర్కొన్న ఆయన, తామెప్పుడూ హద్దులు మీరలేదని, మర్యాదగా నడుచుకున్నామని చెప్పారు.