: క్రికెట్ ను చాలా మిస్ అవుతున్నా: శ్రీశాంత్


ఐపీఎల్ క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న క్రికెట్ ర్ శ్రీశాంత్ పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రస్తుతం శ్రీ సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే, మళ్లీ క్రికెట్ లోకి తిరిగివస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను నిజంగా క్రికెట్ ను మిస్ అవుతున్నానని, తన ప్రాక్టీస్ ను ఇంకా కొనసాగిస్తున్నాననీ అన్నాడు. భవిష్యత్తులో కనీసం ఫస్ట్ క్లాస్ లేదా క్లబ్ క్రికెట్ అయినా ఆడతానన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలాఉంటే, సినిమాలు చేయాలనుకుంటున్నట్టు శ్రీ తెలిపాడు. ఇప్పటికే ఓ తెలుగు సినిమా చేయాలని సిద్ధమవుతున్నానని, అటు తమిళ సినిమా కూడా చేసే ఛాన్స్ ఉందని చెప్పాడు. అన్నీ సరిగా కుదరితే ఇకనుంచి నటనే తనకో సరికొత్త దారి అవుతుందని వివరించాడు.

  • Loading...

More Telugu News