: తిరుమలలో తగ్గని వర్షం
గురువారం ఉదయం నుంచి తిరుమలలో ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణంలో మార్పులు సంభవించి చల్లని గాలులు వీస్తున్నాయి. వర్షం, చలిలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మంది వ్యాపారులు తమతమ దుకాణాలను మూసివేశారు. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. అటు తిరుపతిలోనూ గురువారం ఉదయం నుంచి వర్షం పడుతోంది. కపిలతీర్థం జలపాతం కనువిందు చేస్తోంది. కాగా భారీ వర్షం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కుడా తగ్గింది. సర్వ దర్శనానికి వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్ లో 6 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి సాయంత్రం లోగా దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.