: ప్రతిదానికి ఇలా సస్పెండ్ చేస్తూ పోతే మిగిలేది ఎవరు?: బీజేపీ
ప్రతి చిన్న విషయానికి సభ్యులను సస్పెండ్ చేస్తూ పోతే శాసనసభలో మిగిలేది ఎవరని బీజేపీ సభ్యుడు ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శాసనసభ్యులెవరైనా తప్పు మాట్లాడితే స్పీకర్ రూలింగ్ ఇవ్వవచ్చని అన్నారు. ఒకే అంశాన్ని ఇంతలా సాగదీయడం కూడా సరికాదని ఆయన టీడీపీ సభ్యులకు హితవు పలికారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్, గతంలో ఇలాగే ప్రవర్తించిన అధికారపక్షం సభ్యులను ఎందుకు సస్పండ్ చేయలేదని ఆయన నిలదీశారు.