: వరకట్న హత్య కేసులో అత్తమామలకు ఏడు, భర్తకు పదేళ్ల జైలు
అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆ పై తల్లిదండ్రుల సహాయంతో ఆమెను చంపి ఉరేసుకుందని నమ్మించబోయిన ప్రబుద్ధుడికి ఉత్తరప్రదేశ్ లోని ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఈ నేరంలో ముద్దాయి కమలేశ్ కుమార్ కు సహకరించిన అతని తల్లిదండ్రులు రామ్ కుమార్, ఉషాదేవిలకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ముగ్గురికీ 10 వేల రూపాయల జరిమానాను విధిస్తున్నట్టు న్యాయమూర్తి ఓంప్రకాష్ అగర్వాల్ తీర్పిచ్చారు. జూన్ 16, 2010న కమలేశ్ తన భార్య సుష్మను పథకం ప్రకారం హత్య చేసి, ఆ తరువాత ఇంటి సీలింగుకు ఉరి వేసారు. పోలీసుల విచారణ అనంతరం నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు.