: నాలాలో మహిళ మృతి ఘటనలో జీహెచ్ఎంసీపై హత్యానేరం కేసు
సికింద్రాబాద్ లో బుధవారం రాత్రి కురిసిన వర్షం నేపథ్యంలో నాలాలో పడి మృతి చెందిన మహిళ సత్యవాణి ఘటనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే నాలాలు పొంగిపొర్లాయని, ఆ క్రమంలోనే సత్యవాణి మరణించిందని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణలతో వారు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో జీహెచ్ఎంసీపై ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో గోపాలపురం పీఎస్ పోలీసులు జీహెచ్ఎంసీపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.