: భద్రతా వైఫల్యం వల్లే తిరుమలలో అన్యమత ప్రచారం : స్వరూపానందేంద్ర


శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర డిమాండ్‌ చేశారు. హిందూ పుణ్యక్షేత్రాల వద్ద అన్యమత ప్రచారాన్ని అరికట్టాలంటే చట్టంలో మార్పులు రావాలని అన్నారు. గురువారం నాడు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వరూపానంద స్వామి మాట్లాడుతూ, టీటీడీ, భద్రత సిబ్బంది వైఫల్యం వల్లే పాస్టర్‌ సుధీర్‌ ఆలయం దగ్గర అన్యమత ప్రచారం చేశారని ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అన్యమత ప్రచారాన్ని అరికట్టేందుకు పీఠాధిపతుల సూచనలు స్వీకరించాలని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో హిందువులే పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర కోరారు. మహామణి మండపం తిరుమలలో నిర్మించటం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి, తిరుచానూరులో నిర్మిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట మహామణి మండపం నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News