: మోదీ ఉపన్యాసానికి 500 మంది ఆస్ట్రేలియన్ సీఈఓలు
ఈ నెల 18న మెల్ బోర్న్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉపన్యాస కార్యక్రమం జరగనుంది. ఈ ప్రసంగానికి ఆస్ట్రేలియాకు చెందిన 500 మంది టాప్ సీఈవోలు, అతిపెద్ద కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్ లు హాజరవనున్నారు. అంతేగాక భారత వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం మయన్నార్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ సాయంత్రం ఆస్ట్రేలియా చేరుకుంటారు. 28 ఏళ్ల కిందట తొలిసారి భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఇక్కడ పర్యటించారు. మళ్లీ మోదీ ఇప్పుడు పర్యటించనున్నారు.