: ఏపీ రాజధాని పేరు 'అమరావతి'?
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయం డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు రాజధాని నగరానికి ఏ పేరు పెట్టాలనే విషయంపై చర్చ మొదలైంది. ఎన్టీఆర్ నగర్ లేదా ఎన్టీఆర్ కేపిటల్ సిటీ అనే పేరు పెడితే బాగుంటుందని గతంలో కొందరు టీడీపీ నేతలు కోరారు. ఇప్పుడు 'అమరావతి' అనే పేరు పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. అమరావతి అనేది చారిత్రక నామమని... 2వేల సంవత్సరాల సంస్కృతికి, భవిష్యత్తుకు వారధిలాంటిదని వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తాజాగా అమరావతి పేరును ప్రతిపాదిస్తూ చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఈ పేరువైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరుతో అనేక కాలనీలు ఉన్నందున వాటితో పాటు ఇది కూడా కలిసిపోతుందని మరికొందరు భావిస్తున్నారు. మరి, చివరకు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో?