: బ్రిస్ బేన్ లో బ్యాటింగ్ కు ధోనీ భయపడ్డాడా?


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. బొటనవేలికి గాయంతో అతడు శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ తో పాటు ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ లో కూడా కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ మధ్యలో జట్టుతో కలుస్తాడు. అప్పటికీ ఆస్ట్రేలియా నగరం బ్రిస్ బేన్ లో జరిగే టెస్టు ముగుస్తుంది. టెస్టు మ్యాచ్ లకు సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన మైదానాల్లో బ్రిస్ బేన్ పిచ్ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఆ పిచ్ పై ఆడేందుకు అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల జట్ల సభ్యులు కూడా ఉవ్విళ్లూరుతారు. అయితే ధోనీ కావాలనే ఈ మ్యాచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోమవారం ఆస్ట్రేలియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. బౌన్సీ పిచ్ గా పేరుగాంచిన బ్రిస్ బేన్ మైదానంలో బ్యాటింగ్ కు భయపడే ధోనీ రెస్ట్ తీసుకున్నాడన్నది ఆ కథనాల సారాంశం. ధోనీకి అసలు గాయమెప్పుడైందని, కేవలం బ్రిస్ బేన్ మ్యాచ్ నుంచి తప్పించుకునేందుకే అతడు గాయం పేరు చెబుతున్నాడని కూడా ఆ పత్రికలు పేర్కొన్నాయి. అయితే వీటిపై అటు ధోనీ కాని, బీసీసీఐ కాని స్పందించిన పాపాన పోలేదు. దీంతో ఆస్ట్రేలియా పత్రికల కథనాలు నిజమేనేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తన హెలికాఫ్టర్ షాట్లతో ఆస్ట్రేలియాను చాలాసార్లు ఉతికిపారేసిన ధోనీకి బ్రిస్ బేన్ పిచ్ అంటే అంతగా భయమేమీ లేదని, అయినా ఆస్ట్రేలియా నుంచి ప్రపంచ కప్ ను లాగేసుకున్న మిస్టర్ కూల్ ఆ దేశ జట్టుకు భయపడటమేంటని అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News