: ఖైరతాబాద్ గణేశుడి భారీ లడ్డూకు గిన్నిస్ బుక్ లో చోటు!


ఖైరతాబాద్ వినాయకుడికి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానూ భారీ వినాయకుడిగా పేరుంది. అంతేకాదండోయ్, ఆయన చేతిలో పెట్టే లడ్డూ కీర్తి ప్రతిష్ఠలు దేశ ఎల్లలు దాటేశాయి. ఒకటి కాదు రెండు కాదు, వరుసగా నాలుగేళ్లుగా ఈ లడ్డూ ‘భారీ’తనంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టేస్తోంది. మరి ఈ లడ్డూ తయారీదారులు ఎవరో తెలుసా? తూర్పు గోదావరి జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగానూ కాజాలకు ప్రసిద్ధిగాంచిన తాపేశ్వరంకు చెందిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ యజమాని వెంకటేశ్వర రావు. మొన్నటి వినాయక చవితి సందర్భంగా పేరైతే విన్నాం కాని, గిన్నిస్ రికార్డుల గురించి తెలియదంటారా? ఈ ఏడాదే కాదండి బాబూ.., 2011 నుంచి ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డూలను సరఫరా చేస్తున్న ఆయన వరుసగా నాలుగేళ్లుగా ఈ రికార్డును కైవసం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ ఏడాది 7,132.87 కేజీల భారీ లడ్డూను ఖైరతాబాద్ గణనాథుడికి వెంకటేశ్వరరావు సమర్పించుకున్నారు.

  • Loading...

More Telugu News