: రికార్డింగ్ డాన్సులకు అనుమతివ్వాలంటూ గ్రామస్తుల ఆందోళన


రికార్డింగ్ డాన్సును పోలీసులు అడ్డుకోవడం ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపురంలో గ్రామ దేవత సంబరాల్లో భాగంగా గ్రామస్తులు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసుకున్నారు. రికార్డింగ్ డాన్సులు నిషేధమంటూ పోలీసులు వాటిని అడ్డుకున్నారు. దీంతో, గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రికార్డింగ్ డాన్సుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇంతచేసినా పోలీసులు మాత్రం వారికి అనుమతి ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News