: పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు
పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. పరస్పరం దాడి చేసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో... వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బీర్భూమ్ లో ఘర్షణలు మరింత పెరగకుండా చూసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.