: 'ఏసీఎంఈ'కి దక్కిన తెలంగాణ సోలార్ ప్రాజెక్ట్


తెలంగాణలో 80 మెగావాట్ల సోలార్ పివి (ఫోటో వోల్టాయిక్) పవర్ ప్రాజెక్ట్ ను ఏసీఎంఈ గ్రూప్ దక్కించుకుంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో తాము విజయం సాధించినట్టు ఏసీఎంఈ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం తాము 660 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు తెలిపింది. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం తెలంగాణ డిస్కంలతో 25 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఏసీఎంఈ గ్రూప్ చైర్మన్ మనోజ్ కుమార్ వివరించారు. ఐదు నెలల్లోగా నిధుల సమీకరణ పూర్తి చేయాల్సి ఉందని, 10 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అయన అన్నారు.

  • Loading...

More Telugu News