: బాలీవుడ్ దర్శకుడు రవి చోప్రా మృతి
బాలీవుడ్ దర్శకుడు రవి చోప్రా (68) మరణించారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆయన చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనను గతవారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించారు. చోప్రాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 'బాగ్ బన్' చిత్రంతో పేరు సంపాదించిన ఆయన పలు చిత్రాలను, పురాణ కథలపై సీరియళ్లను రూపొందించారు. దివంగత హిందీ దర్శకుడు బీఆర్ చోప్రా కుమారుడే ఈ రవి చోప్రా.