: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో కొంత ఆలస్యమైంది: అశోక్ గజపతిరాజు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో కొంత ఆలస్యం అయిందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఈ మధ్యాహ్నం అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారు ఈ విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్యాకేజీ వేరని ఈ సందర్భంగా అశోక్ తెలిపారు. రాజధాని నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర సిద్ధంగా ఉందని, అయితే రాజధాని నిర్మాణానికి నిధులు ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంచనా వేయలేదని చెప్పారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్మలా సీతారామన్ తో మరోసారి భేటీ అవుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News