: ఢిల్లీని వణికిస్తున్న చలి


దేశ రాజధానిలో చలి తీవ్రత పెరగటం ప్రారంభమైంది. బుధవారం నాడు 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు ఢిల్లీని కమ్మిన పొగమంచు మధ్యాహ్నం వరకు వదలలేదు. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఉదయం 9 గంటల ప్రాంతంలో వాతావరణంలో 76 శాతం తేమ నమోదైందని అధికారులు తెలిపారు. మరో వారంలో రాత్రి ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు చేరవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News