: ఇండియాతో వాణిజ్య ఒప్పందం 'అద్భుతం': ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్
భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇది సరైన సమయమని... మరో సంవత్సరంలోగా ఒప్పందం కుదిరితే అది అద్భుతమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ వ్యాఖ్యానించారు. 2005 నుంచి చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతుండగా అవి కొలిక్కి వచ్చాయని, మరో నాలుగు రోజుల్లో జరగనున్న జీ20 సదస్సులో సంతకాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఆపై ఇండియాతోనూ అదే తరహా డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభంకానున్న నేపథ్యంలో టోనీ అబోట్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.